ఎన్టీఆర్ తన తండ్రిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఇక వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న “అరవింద సమేత” సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు కబురు పంపి రేపు షూటింగ్ కు రెడీ చేసుకోమని తాను షూటింగుకి హాజరవుతానని చెప్పినట్లు వినికిడి. తండ్రిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నా, తనను నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మాత నష్టపోకూడదని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.ఎంతో బాధలో ఉన్న ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఎన్టీఆర్ కు పని మీద ఉన్న డెడికేషన్ ఎలాంటిదో మరో సారి ఎన్టీఆర్ తెలియచేసాడని చెబుతున్నారు. మరో వైపు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా సోమవారం నుంచి మొదలు కానుంది. కళ్యాణ్ రామ్ కూడా సోమవారం నుంచి షూటింగ్ కి హాజరవుతానని ఇప్పటికే చిత్ర యూనిట్ కు తెలియచేసినట్లు తెలుస్తుంది.