దేశంలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు ప్రధాని మోదీ :ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన” ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ రైతుల కోసం దాదాపుగా 17 వేళ కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా రైతులతో మాట్లాడి ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో నేరుగా రెండు వేల రూపాయలు జమకానున్నాయి.

దీనితో రైతులను ఆర్ధికంగా ప్రధాని మోదీ ఆదుకునట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది “ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన” ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలను అందచేయనున్నారు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కోసం బడ్జెట్ లో ఏకంగా 75 వేల కోట్ల రూపాయలను మోదీ సర్కార్ కేటాయించింది. దేశవ్యాప్తంగా 8.69 కోట్ల మదఞ్హి రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందనున్నారు. ప్రతి ఏడాది మూడు విడతలలో ఈ డబ్బు రైతుల ఖాతాలలో జమవుతుంది.

పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని పొడిచి చంపిన ప్రేమికుడి తండ్రి