గోపి చంద్ మాలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్న రవితేజ మరో కొత్త సినిమా అంకీకరించాడు. ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్తా మామ’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారంగా ఉంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తారు. ఇక రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా మేలో విడుదల చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •