ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రారాణిగా వెలుగొందిన త్రిష ఇప్పుడు కొత్త కొత్త భామలతో పోటీ పడలేక, వయస్సు మీద పడుతుండటంతో కాస్త వెనుక పడింది. కానీ త్రిష ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి త్రిష సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని, కానీ తనకు ఎప్పటికైనా ఒక వ్యక్తి నచ్చి అతడిని పెళ్లాడాలి అనుకుంటే మాత్రం “వెగాస్”లో చేసుకుంటానని, తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని వెల్లడించింది.

ప్రస్తుతం త్రిష తమిళ, తెలుగు తెరపై సినిమాలు చేస్తుంది. మెగా స్టార్ చిరంజీవి 152వ చిత్రంతో పాటు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా “రామ్” సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఒకేసారి మూడు సినిమాలతో ఉత్సాహంగా ఉండటంతో అప్పుడప్పుడు అభిమానులతో సందడి చేస్తూ ఇలా తన మనస్సులో మాటలను బయట పెడుతుంది.