అమెరికా జర్నలిస్ట్ బాబ్ ఉడ్ 2018లో ఒక పుస్తకంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ను చంపించాలని అమెరికా అధ్యక్షుడు పధకం వేసినట్లు ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. అతడు పుస్తకంలో రాసే ముందు ఏడాది సిరియాలో పౌరులపై జరిగిన రసాయనిక దాడుల్లో ఎంతో మంది చనిపోయారు. అదే సమయంలో అసద్ ను మట్టుబెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అసద్ ను మట్టుపెట్టడంలో విఫలమయ్యారు. కానీ ఇలా అమెరికా జర్నలిస్ట్ తన పుస్తకంలో రాస్తే ట్రంప్ అప్పట్లో కండించి మరొక విధంగా కథ చెప్పుకొచ్చారు.

రాబోయే రెండు నెలలలో అమెరికాలో ఎన్నికలు ఉండటంతో ట్రంప్ మరోసారి సిరియా అధ్యక్షుడు విషయాన్ని ప్రస్తావిస్తూ అసద్ ను అప్పట్లో తాను చంపేయాలని ఒక నిర్ణయానికి వచ్చానని అయితే తమ డిఫెన్స్ సెక్యూరిటీ మాటిష్ దానికి అంగీకరించలేదని దీనితో తాను ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని అప్పుడు ప్రస్తావిస్తే అందులో నిజం లేదని చెప్పి ఇప్పుడు సిరియా అధ్యక్షుడు గురించి ప్రస్తావించడాన్ని చూస్తుంటే ఎన్నికలలో రాజకీయ ఎత్తుల కోసం ట్రంప్ రాబోయే రోజులలో ఇంకెన్ని కథలు చెబుతాడో, అతడు చేయాలనుకున్న ఎన్నో పనులను ఓట్ల రూపంలో మార్చుకునేందుకు నిజాలు ఒకొక్కటి బయటకు వచ్చే అవకాశముందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.,

ఇక ట్రంప్ మాట్లాడుతూ రాబోయే మూడు లేదా నాలుగు వారాలలో అమెరికాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, తాను నవంబర్ మొదటి వారానికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తలచానని కానీ ఇప్పుడు అంతకు ముందే వ్యాక్సిన్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రష్యా తీసుకువచ్చిన వ్యాక్సిన్ పై ట్రంప్ పెదవి విరుస్తుంటే, ఇప్పుడు అమెరికా తీసుకొని వచ్చే వ్యాక్సిన్ పై కూడా ప్రపంచదేశాలు పెదవి విరుస్తూ ఇదంతా ట్రంప్ ఎన్నికల స్టంట్ కోసం వ్యాక్సిన్ పేరుతో నాటకాలాడుతూ త్వరగా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని ఆరోపిస్తున్నారు.