అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు తెలంగాణాలో ఓ వ్యక్తి ఏకంగా గుడినే కట్టాడు. ట్రంప్ పై విపరీతమైన అభిమానం పెంచుకున్న అతను ట్రంపే నా దేవుడు అంటున్నాడు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన బుస్స కృష్ణ ట్రంప్ పుట్టిన రోజును పురస్కరించుకుని గుడి కట్టేసాడు. ట్రంప్ విగ్రహం ఏర్పాటు చేసిన ఆయన గత ఐదేళ్ల నుండి కుంకుమార్చనలు చేస్తున్నాడు.

ఓ రోజు అర్ధరాత్రి ట్రంప్ కలలోకి వచ్చాడని.. అప్పటి నుండి ట్రంప్ ను ఆరాధిస్తున్నానని బుస్స కృష్ణ తెలియచేసాడు. ట్రంప్ విగ్రహం వద్ద పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన బుస్స కృష్ణ.. గ్రామా ప్రజలకు అన్నదానం కూడా ఏర్పాటు చేసాడు. ఇతను గతంలో ట్రంప్ పుట్టిన రోజుకు రక్తదానం కూడా చేసాడు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. భారత్-అమెరికా సంభందాలు మరింత మెరుగు పడాలని కోరుకున్నాడు. ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు వస్తున్న నేపథ్యంలో ఆయనతో ఎలాగైనా కలిపించాలని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణ విజ్ఞపి చేసాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •