అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ యాజమాన్యమైన బైట్ డ్యాన్స్ కు ఇచ్చిన గడువు మరొక రెండు రోజులలో ముగియనుంది. అమెరికాకు చెందిన టిక్ టాక్ కనుక తమ దేశంలోని ఏదైనా సంస్థకు బదిలీ చేయకపోతే టిక్ టాక్ ఇక నుంచి తమ దేశంలో నిషేధం విధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బైట్ డ్యాన్స్ సంస్థ పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. దీనిపై చైనా ప్రభుత్వం అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ దేశానికి చెందిన టెక్నాలజీ సంస్థపై ట్రంప్ నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ వెనక్కు వెళ్ళలేదు.

దీనితో చైనా ప్రభుత్వం అమెరికాకు తలొగ్గవద్దని బైట్ డ్యాన్స్ కు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అమెరికాలో టిక్ టాక్ ను ట్రంప్ నిషేధించినా పర్వాలేదని, మరొకరికి అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారట. ఇలా ఒకవేళ అమెరికాకు కనుక టిక్ టాక్ ను అమ్మేస్తే ట్రంప్ కు తలొగ్గినట్లు అవుతుందని వార్తలను బయటకు లీక్ చేస్తున్నారు. కానీ బైట్ డ్యాన్స్ మాత్రం వేల కోట్ల రూపాయలను వదులుకోవడం ఇష్టం లేక తమ నుంచి ఇలాంటి వార్తలు రాలేదని కండిస్తున్నా ట్రంప్ ను బెదిరించే పనికి పూనుకుంటుంది. కానీ ట్రంప్ మాత్రం టిక్ టాక్ నిషేధించడంలో వెనక్కు తగ్గే సూచనలు కనపడటం లేదు. మరొక వైపున బైట్ డ్యాన్స్ ఇప్పుడు బీరాలు పలుకుతున్నా రాబోయే రోజులలో ట్రంప్ నిర్ణయానికి తలవంచక తప్పని పరిస్థితి నెలకొని ఉండే అవకాశాలే ఎక్కువ.