గత వారం సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్ద మనుషులు సీఎం కేసీఆర్ ను కలసి షూటింగ్స్ కు అనుమతివ్వాలని ఇండస్ట్రీలో ఉన్న మరికొన్ని సమస్యలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద వివాదమే చెలరేగింది. బాలకృష్ణను సీఎం కేసీఆర్ తో మీటింగ్ కు ఆహ్వానించకపోవడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూములు పంచుకోవడానికి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా బాలకృష్ణ భూముల వ్యవహారం లేవనెత్తుడంతో ఈ విషయంతో పాటు సీఎం కేసీఆర్ తో జరిగిన మీటింగ్ లో పాల్గొనని నాగబాబు మీడియా ముందుకు వచ్చి స్పందిస్తూ బాలకృష్ణకు వార్నింగ్ ఇస్తూ, ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, ముందు తెలంగాణ ప్రభుత్వంతో పాటు సినిమా పెద్దలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మరొకసారి ఎప్పటి నుంచో రాజుకుంటున్న గొడవలు బహిర్గతమయ్యాయని కొంతమంది బాలకృష్ణకు నేరుగా సపోర్ట్ చేస్తూ ఆ మీటింగ్ కు పిలిస్తే బాగుండేదని అంటున్నారు

ఇక మరొకవైపున బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వెనుక నిజ నిజాలు ఉండటంతోనే అలా వ్యాఖ్యలు చేసారని, హైదరాబాద్ శివార్లలో చిరంజీవికి చెందిన ఐదెకరాల భూమి ఇబ్బందుల గురించి చర్చించారని, అలాగే నిర్మాత సి కళ్యాణ్ కమర్షియల్ కాంప్లెక్ విషయంతో పాటు ఎప్పటి నుంచి నాగార్జునకు చెందిన భూముల లొల్లి ఇలా అన్నింటి గురించి మట్లాడుకునట్లు అనేక ఆరోపణలు చిరంజీవి ప్రత్యర్థి వర్గం లేవనెత్తుతుంది. కానీ దీనిపై చిరంజీవి క్యాంప్ ఎలాంటి స్పందన కనపరచలేదు. ఈరోజు మరొకసారి బాలకృష్ణను పిలవకుండానే చిరంజీవి అధ్యక్షతన సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది పెద్దలు సమావేశమయ్యారు. ఈ గొడవ రాబోయే రోజులలో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?

చిరంజీవి భజన కొట్టుకుంటుంటే, జగపతిబాబు నిశ్శబ్దంగా సామజిక సేవ కార్యక్రమాలు