తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మొన్నటిదాకా 2 వేల పైన నమోదైన పాజిటివ్ కేసులు ఈరోజు 1,378 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,87,211 కి చేరింది. ఇక కరోనాతో 7 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,107 కి చేరింది.

ఇక తాజాగా 1,932 మంది కరోనాతో కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,56,431 కి చేరింది. ఇక రాష్ట్రంలో 29,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24,054 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 81.42 శాతం ఉండగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 28,86,334 శాంపిల్స్ పరీక్షించారు.