తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,103 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,91,386 కి చేరుకుంది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో 298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,127 కి చేరింది.

ఇక తాజాగా 2,243 మంది కరోనాతో కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,60,933 కి చేరింది. ఇక రాష్ట్రంలో 29,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,880 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 81.42 శాతం ఉండగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 29,96,001 శాంపిల్స్ పరీక్షించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేత.. అందరూ నిర్దోషులే..!

కొత్తపద్ధతిలో వాట్సాప్‌లను క్రాష్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. బాధితుల్లో సెలెబ్రిటీలు..!