తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 51,247 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 277 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,60,571 కి చేరింది. ఇక కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 984 కి చేరింది.

ఇక తాజాగా 2,180 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,187 కి చేరింది. ఇక రాష్ట్రంలో 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,584 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 80.45 శాతం ఉండగా, మరణాల రేటు 0.61 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 22,20,586 శాంపిల్స్ పరీక్షించారు.

అఖిల్ సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన నాగార్జున..!

సెట్స్ లో కుప్పకూలి నటుడి మృతి..!

పవన్ కళ్యాణ్ సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్..!