తెలంగాణలో కరోనా కేసులు మళ్ళి పెరిగాయి. నిన్న 1,378 పాజిటివ్ కేసులు నమోదవగా, ఈరోజు భారీగా 2 వేల పైన కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,072 కేసులు నమోదుకావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,89,283 కి చేరింది. ఇక కరోనాతో 9 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,116 కి చేరింది.

ఇక తాజాగా 2,259 మంది కరోనాతో కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,58,690 కి చేరింది. ఇక రాష్ట్రంలో 29,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,934 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 81.42 శాతం ఉండగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 29,40,642 శాంపిల్స్ పరీక్షించారు.