తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 53,094 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 318 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,65,003 కి చేరింది. ఇక కరోనాతో 9 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,005 కి చేరింది.

ఇక తాజాగా 2,108 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,33,555 కి చేరింది. ఇక రాష్ట్రంలో 30,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,674 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 80.45 శాతం ఉండగా, మరణాల రేటు 0.61 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 23,29,316 శాంపిల్స్ పరీక్షించారు.

అల్లు అర్జున్ పై పోలీసులకు పిర్యాదు..!

‘ఖైదీ’ దర్శకుడితో కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్..!

మొదలైన ఆర్జీవీ బయోపిక్.. దర్శకుడిగా 20 ఏళ్ళ యువకుడు..!