తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. నిన్న 1,302 కేసులు మాత్రమే నమోదవగా, ఈరోజు ఏకంగా 2,166 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,74,774 కి చేరింది. ఇక కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,052 కి పెరిగింది.

ఇక తాజాగా 2,143 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,44,073 కి చేరింది. ఇక రాష్ట్రంలో 29,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 22,620 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 80.45 శాతం ఉండగా, మరణాల రేటు 0.61 శాతంగా ఉంది.

వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటున్న శివబాలాజీ..!

శర్వానంద్ మూవీ కూడా ఓటిటి బాటలోనే..!