తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 54,443 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, కొత్తగా 2,214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 305 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,93,600 కి చేరింది. ఇక కరోనాతో 8 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,135 కి చేరింది.

ఇక తాజాగా 2,474 మంది కరోనాతో కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,63,407 కి చేరింది. ఇక రాష్ట్రంలో 29,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,702 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 81.42 శాతం ఉండగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 30,50,444 శాంపిల్స్ పరీక్షించారు.