తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 62,543 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 2,478 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,35,884 కి చేరింది. ఇక కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 886 కి చేరింది.

ఇక తాజాగా 2,011 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,02,024 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,994 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 16,05,521 కరోనా టెస్టులు చేశారు.

జైలు నుండి విడుదల కాబోతున్న శశికళ.. మరింత హీటెక్కబోతున్న తమిళ రాజకీయాలు..!

అచ్చెన్నాయుడు కోపం చల్లారినట్లేనా?