తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 54,459 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 2,123 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 305 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,69,169 కి చేరింది. ఇక కరోనాతో 9 మంది మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,025 కి చేరింది.

ఇక తాజాగా కరోనా నుండి 2,151 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,37,508 కి చేరింది. ఇక రాష్ట్రంలో 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 80.45 శాతం ఉండగా, మరణాల రేటు 0.61 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 24,34,409 శాంపిల్స్ పరీక్షించారు.

ఐపీఎల్ 2020.. తొలి మ్యాచ్‌లో చెన్నైతో ముంబై ‘ఢీ’..!

ఈరోజు మరో టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్ తో భేటీ

బ్రిటన్ లో చెలరేగుతున్న కరోనా వైరస్, మరోసారి లాక్ డౌన్ దిశగా