తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుంది. ఇక గత 24 గంటల్లో కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఒక్క జిహెచ్ఏంసి పరిధిలోనే అత్యధికంగా 479 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 84,544 కి చేరింది. ఇక కరోనాతో 9 మంది మృతి చెందగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 654 కి చేరింది.

ఇక తాజాగా 1,920 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 61,294 కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 22,596 కి చేరింది. ఇక తెలంగాణలో రికవరీ రేటు 72.49 శాతంగా ఉందని, ఇది దేశ సగటు కంటే ఎక్కువని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే మరణాల రేటు 0.77 శాతంగా ఉందని వివరించింది. ఇక నిన్న తెలంగాణ వ్యాప్తంగా 22,972 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పరీక్షల సంఖ్య 6,65,847 కి చేరింది.

చైనా కంపెనీలపై ఐటీ శాఖ దాడులు..!

గూగుల్ సరికొత్త ఫీచర్.. వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు..!

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!