తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల స్కూళ్లలో ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కేటగిరీలలో దాదాపుగా 1900 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ఆర్ధిక సఖ ఆమోదం తెలపడంతో పాటు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. వీరిలో ట్రైన్డ్ గ్రాడుయేట్ టీచర్ లు 1071తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియెన్, క్రాఫ్ట్, స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగుస్తునందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు. దీనితో దాదాపుగా గురుకులంలో 1900 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •