‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా యూనిట్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 10న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు, నమ్రత, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక స్వామివారి దర్శన అనంతరం వీరు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తో భేటీ అయ్యారు. ఆయనతో సరదాగా మాట్లాడైన మహేష్.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.