ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఈరోజు ఉదయం నుంచి పలువురు లాగిన్ కాలేకపోతున్నట్లు తెలుస్తుంది. లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందిస్తూ ఎక్కడ లోపం ఉందో కనుక్కునే పనిలో తమ నిపుణులు తలమునకలై ఉన్నారని, త్వరలో లోపాన్ని సరిద్దిద్దుతామని, అంతరాయానికి క్షమించమని కోరింది.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల రిపోర్టులు రావడంతో ట్విట్టర్ వర్గాలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి న్యూస్ ట్రేండింగ్ లో ఉంది అని తెలుసుకోవడానికి చాల మంది నెటిజన్లు ట్విట్టర్ నే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో టాప్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ అనే దానిలో ఎటువంటి సందేహం లేదు.