తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన తల్లి 11 ఏళ్ళ వయసున్న తన ఇద్దరు కుమారులను చిత్రహింసలకు గురి చేస్తూ, వారిని కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించడంతో వారిద్దరూ ఏమి చేయాలో పాలుపోక తన అమ్మమ్మ సహకారంతో గుంటూరులోని స్పందన కార్యక్రమంలో పిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లితండ్రులకు ఇద్దరు పిల్లలు సంతానం.

2014 డిసెంబర్ వారి నాయనమ్మ చనిపోగా, 2015 జనవరిలో పిల్లల తండ్రి చనిపోయాడు. దీనితో ఒంటరిగా జీవిస్తునం ఆ మహిళ దగ్గరలోనే షేక్ రహీమ్ అనే అతడితో సహజీవనం చేస్తుండేది. అతడు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడని, తమను అప్పుడప్పుడు వేధిస్తుండేవాడని చెప్పుకొచ్చారు. ఇక కొన్ని రోజులకు షాక్ రహీమ్ స్నేహితుడు ప్రమోద్ తమ ఇంటికి రావడంతో పాటు తన తల్లితో చనువు ఏర్పరుచుకోవడంతో ఆ ముగ్గురు కలసి ఎప్పుడు తమ ఇంట్లోనే ఉంటూ తమను వేధిస్తూ చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా గత ఫిబ్రవరి నుంచి తమను స్కూల్ కు కూడా పంపించడం లేదు.

గత నాలుగు రోజుల క్రితం తమ తల్లితో ప్రమోద్ కు గొడవైందని, ఆ గొడవ తమ వల్లే అయిందని పిల్లలిద్దరిని గొడ్డును బాదినట్లు బాధి ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో వారు పక్కనున్న షాప్ అతడి దగ్గర 100 రూపాయలు అప్పుగా తీసుకొని వారి అమ్మమ ఇంటికి వెళ్లడంతో అక్కడ నుంచి నేరుగా స్పందనకు వెళ్లి పిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ పిల్లలు తమ తల్లితో పాటు ఆ ఇద్దరిని కూడా శిక్షించాలని, తమకు వారి నుంచి విముక్తి ప్రసాదించమని కోరడంతో పోలీసులు ఆ పిల్లలిద్దరు చెప్పే మాటలకూ విస్తు పోయి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలని అందరూ కోరడంతో వారిపై దర్యాప్తు మొదలు పెట్టు కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు.