ద్విచక్ర వాహనాలలో మహిళలు ప్రయాణించేటప్పుడు వారి చున్నీ, చీర వంటివి వెనుక చక్రాలలోకి ఇరుక్కుని ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. వాహన తయారీలో కొన్ని మార్పులు చేయాలనీ వాహన కంపెనీలకు తెలియచేసింది. వెనుక చక్రంలో కనీసం సగ భాగాన్ని కప్పి ఉంచేలా వాహన తయారీదారులు ఏర్పాటు చేయాలనీ.. ఈ ఏడాది అక్టోబర్ 1 లోగా ఇది అమలు జరగాలని ఆదేశించింది. అలాగే ఒకవైపు కూర్చున్న వారు పట్టుకునేందుకు వీలుగా వాహనానికి పక్కన కానీ.. డ్రైవర్ సీటుకు వెనుక గాని ఒక హ్యాండిల్ తప్పని సరిగా బిగించాలని.. అలాగే పాదాన్ని ఆనించడానికి తగిన ఏర్పాట్లు చేయాలనీ మంత్రిత్వ శాఖ తగిన సూచనలు ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •