చంద్రబాబు నాయుడుకి భజన చేసే రెండు ప్రముఖమైన మీడియా చానెల్స్ గత ఎన్నికల ముందు బీజేపీ మీద గంటల కొద్ది విషపు రాతలతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరిని తిడుతూ చేసిన అనేక వీడియోలు దాదాపుగా మూడు వేలకు పైగా వారి యూట్యూబ్ చానెల్స్ నుంచి తొలగించివేశారని ఇప్పుడు మీడియా సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి బాకా కొట్టే ఆ రెండు చానెల్స్ చంద్రబాబు నాయుడుని నమ్ముకొని వందల కోట్ల రూపాయలు గత ఐదేళ్లలో సంపాదించారన్న వార్తలు ఉన్నాయి.

కానీ చంద్రబాబు నాయుడు అత్యంత దారుణంగా ఓడిపోవడంతో పాటు బీజేపీ కేంద్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించడంతో ఇక చేసేది లేక తమపైనే ఎలాంటి కేసులు రాకుండా, బీజేపీతో సయోధ్య కోసం ఇప్పటికే ఒక మీడియా అధిపతి అమిత్ షాను కలసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బీజేపీకి భజన కొట్టడానికి నిర్ణయించుకోవడంతోనే ఇప్పుడు బీజేపీపై తమ మీడియాలో వేసిన విషపు రాతలను మొత్తం తీసేసి తాము సచ్చిలుమని బీజేపీ గురించి ఎటువంటి వార్తలు తాము ప్రసారం చేయలేదని నిరూపించుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కానీ బీజేపీకి సంబంధించిన డిజిటల్ మీడియా సభ్యులు వీరి విషపు రాతలను మొత్తం డౌన్ లోడ్ చేసి వారిదగ్గర జాగ్రత్తుగా పెట్టుకున్నారట. ఎప్పటికైనా వీరు కూడా చంద్రబాబు నాయుడులా యు టర్న్ బ్యాచ్ అని నమ్మడంతోనే ముందే జాగ్రత్త పడ్డారు. ఇక బీజేపీతో సయోధ్యలో వీరు రాసిన విషపు రాతలు బీజేపీ సభ్యులు చూపించి వీటి సంగతేమిటని అడగకముందే జాగ్రత్త పడాలని యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించినా బీజేపీ దగ్గర భద్రంగా ఉండటంతో తొలగించడం తప్ప ప్రస్తుతానికి ఏమి చేయలేని పరిస్థితులలో ఉన్నారట.

కానీ ఎవరైనా ఒక్కసారి మోసపోతారు… రెండు సార్లు మోసపోతారు… ఇలాంటి వారు ప్రతిసారి మోసం చేస్తుంటే అమిత్ షా, మోదీ ఎల్లప్పుడూ మోసపోయే రకాలంటారా? అలాంటి పరిస్థితైతే ఈసారి ఎట్టి పరిస్థితులలో లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్ని రాయబారాలు పంపి మీతో కలుస్తామని, ఐదుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి పంపించినా అసలు తెలుగుదేశం పార్టీతో జీవితంలో పొత్తు ఉండదని తేల్చి చెప్పినా చంద్రబాబు నాయుడు పట్టు వదలని విక్రమార్కుడిలా ఇంకా ఢిల్లీ లెవల్ లో తనకు ఉన్న పరిచయాలతో బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.