నీల్‌కురంజి పుష్పాలు 12 ఏళ్ళ తరువాత మళ్ళీ వికసించాయి. ఈ పువ్వులు తాజాగా మధ్యప్రదేశ్ లోని పచ్ మరి ప్రాంతంలో దర్శనమించాయి. చివరిసారిగా 2006లోని కేరళలోని మన్నార్ ప్రాతంలో వికసించిన నీల్‌కురంజి పుష్పాలు ఈసారి కాస్త ఆలస్యంగా పుష్పించాయి. కేరళ, మధ్యప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పుష్పాలు వికసిస్తుంటాయి. ఇది ఒక గడ్డి జాతికి చెందిన పువ్వు. పేరుకు తగ్గితే నీలిరంగులో ఉంటుంది.

ఇక ఈ పుష్పాన్ని మొదటిసారిగా 1838 సంవత్సరంలో గుర్తించారు. అప్పటినుండి ఈ పుష్పం పుష్కరానికోసారి పూస్తుంది. పువ్వులు పూసిన కొన్ని రోజులు తరువాత ఆ మొక్కలు చనిపోతాయి. ఈ పుష్పాల అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక ఈ పువ్వులకు గొప్ప ఔషధ గుణాలున్నాయట. అనేక మొండివ్యాధులను నయం చేసే శక్తీ ఈ పుష్పాలకు ఉంటుందని ఆయుర్వేదంలో ఉందట.

ఇక సరైన మోతాదులో వీటిని ఉపయోగిస్తే ఈ పుష్పం నయం చేయలేని రోగమంటూ ఉండదని ఆయుర్వేద నిపుణులు తెలియచేసారు. అయితే బ్రిటిష్ వారి హయాంలో ఈ పుష్పంలో ఏ భాగాన్ని ఉపయోగించాలో తెలిపే గ్రంధాలన్నీ నాశనం అయ్యాయట. ఇక నీల్‌కురంజి పుష్పాలు 12 ఏళ్ళకొకసారి పూయడంతో దీంతో తయారైన ఔషదాలు చాలా ఖరీదైనవని చెబుతున్నారు.

కంగనాకు చుక్కలు చూపించిన జర్నలిస్ట్

తెలుగుదేశం పార్టీలో త్వరలో మరొక నాలుగు వికెట్లు పడనున్నాయట

వంటలక్క గిఫ్ట్ చూసి ఫిదా అయిపోయిన అభిమాని