సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.‌ కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈనెల 15 నుండి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే 50 శాతం సీట్ల సామర్థ్యంతో మాత్రమే అనుమతిస్తారు. ఇక అక్టోబర్ 15 నుండి కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్ కూడా తెరిచే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 15 నుండి స్కూల్స్ తెరిచే వెసలుబాటు రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. ఇక కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్వష్టం చేసింది.

సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్..!

వారిపై నాకు మరింత గౌరవం పెరిగిందన్న మీనా..!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేత.. అందరూ నిర్దోషులే..!