ఉత్తరప్రదేశ్ కు చెందిన లక్షల మంది దేశ విదేశాలలో వలస కార్మికులుగా వారి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అక్కడ ప్రజలు కార్మికులుగా ఆయా ప్రదేశాలలో పనిచేస్తుంటారు. లాక్ డౌన్ సందర్భంగా పనులు లేక ఇబ్బందులు పడుతుండటంతో కొంతమంది నడుచుకుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణించి వారి గమ్యస్థానాలు చేరుకుంటే, మరికొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లలో చేరుకున్నారు.

దాదాపుగా 20 లక్షల మంది వలస కార్మికులు లాక్ డౌన్ తరువాత ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వారిలో అనుమానితులకు కొంతమంది కరోనా టెస్ట్ లు చేయగా వారిలో 1230 మంది పాజిటివ్ అని తేలిందని అక్కడ ప్రభుత్వం చెబుతుంది. వలస కార్మికులకు కనుక కరోనా సోకితే అది అత్యంత ప్రమాదకరమని, వారు ఎక్కడెక్కడి నుంచి వస్తూ, ఎవరిని కలిశారు అన్నది కాంటాక్ట్ లిస్ట్ సేకరించడం కష్టమని, ఇప్పుడు 1230 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ ప్రభుత్వం కొంత ఆందోళనకు గురవుతుంది.

శకుని పాత్ర చేసిన తరువాత తన కాళ్ళు విరగగొడతామన్నారు