అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దాటికి తీవ్రంగా వణికిపోతుంది. వరుసగా మూడు రోజుల నుండి 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో అక్కడ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే 68000 పాజిటివ్ కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాలో ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి.

దీంతో అమెరికా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 32 లక్షలు దాటింది. ఇక 1460495 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 136671 మంది కరోనాతో మృతి చెందారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 4 కోట్లకు పైగా కరోనా టెస్టులు పూర్తయినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కొత్తగా 1278 పాజిటివ్ కేసులు..!

గూగుల్ ప్లే స్టోర్ నుండి మరో 11 యాప్స్ తొలగింపు..!