ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన నటుడు ఉత్తేజ్. ఈయన నాగార్జున ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం నటిస్తున్న స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ప్రస్తుత తరం హీరోల గురించి ప్రస్తావించిన ఉత్తేజ్.. చాలా మంది హీరోలు చాలా బాగా కష్టపడి వచ్చారన్నారు. జూ ఎన్టీఆర్ లో ఒక స్టార్ తో పాటు ప్రొఫెస్నల్ యాక్టర్ ఉన్నాడు అన్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారి ఆత్మ ఈయనలో కలిసిందేమో అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ చెప్పింది తేడా రాకుండా అదే చేసి చూపించే వారన్నారు. అలాగే కృష్ణ వారసుడిగా పరిచయమైనా మహేష్ బాబు కూడా చాలా బాగా కష్టపడి పైకొచ్చాడన్నారు. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడన్నారు. అలాగే రవితేజ అయితే మన పక్కింటి అబ్భాయిలాగా కనిపిస్తాడన్నారు.

అల్లు అర్జున్ గురించి ఉత్తేజ్ ప్రత్యేకంగా తెలియజేశారు. హీరోలు ఎవరైనా తనను తాము మౌల్డ్ చేసుకోక పోతే ఎవరు రాణించలేరని, ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఒకటి రెండు సినిమాల వరకే అది పనికొస్తుందన్నారు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. ఆ సినిమాలో బన్నీని ఇప్పుడు బన్నీని చూస్తే అసలు గంగోత్రిలో ఉన్నది ఈయనేనా అనిపిస్తుందని.. ఆ విధంగా బన్నీ కష్టపడి వచ్చాడన్నారు. అలాగే రామ్ చరణ్ కి కూడా చిరు నుండి వచ్చిన ప్రొఫెస్నలిజం ఉందని.. ఆయన దానిని ‘రంగస్థలం’ సినిమా ద్వారా బయటకి తీశాడన్నారు. ఈ విధంగా నటుడు ఉత్తేజ్ ఈ తరం హీరోల గురించి వారి నటన గురించి పలు విషయాలను తెలియజేశాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •