అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య-సమంతల కాంబినేషన్ లో ‘మజిలీ’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ నెల 3 వ వారం నుండి ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొనబోతున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతన్య టాప్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చైతు సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరగనుంది. అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చైతు కోసం ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారు. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •