పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఈ నెల 23 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం 30 రోజుల పాటు షూటింగ్ జరగనుందట. ఇప్పుడు జరగబోయే తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వర్క్ 15 రోజులు ఉందని తెలుస్తుంది. మొదటిగా పవన్ పై సీన్స్ ను చిత్రీకరిస్తారా లేక మిగతా వారిపై చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి అక్టోబర్ చివరి నాటికీ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

అయితే ఈ సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్ ఇచ్చిందట. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఆన్లైన్ లో విడుదల చేయడానికి 110 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇది భారీ ఆఫర్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజుతో అమెజాన్ సంస్థ చర్చించినట్లు ఫిలింనగర్ సమాచారం. ఒకవేళ దిల్ రాజు ఒప్పుకుంటే భారీ లాభాలు వస్తాయి. అయితే ఈ ఆఫర్ కి ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కావడంతో అతడి అభిమానులు ఈ సినిమాను థియేటర్లలలోనే చూడాలని కోరుకుంటున్నారు. ఏం చేస్తారనేది చూడాలి.

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్..?

‘సర్కారు వారి పాట’కు భారీగా డిమాండ్..!