పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’. ‘ఎంసీఏ’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మే నెలలో సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇక ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ఈ నెల 23 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం 30 రోజుల పాటు షూటింగ్ జరగనుందట. ఇప్పుడు జరగబోయే తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వర్క్ 15 రోజులు ఉందని తెలుస్తుంది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ చివరి నాటికీ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

ఇక అమెజాన్ ఈ సినిమాను డైరెక్ట్ ఆన్లైన్ చేయడానికి 110 కోట్లను దిల్ రాజుకు ఆఫర్ చేసిందట. అయితే దిల్ రాజు ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతికి థియేటర్లలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ఏపీలో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు

బిగ్ బాస్ లో ఎక్కువ పారితోషికం ఎవరికో తెలుసా..!

జగన్ కి జై కొట్టిన మరో టీడీపీ ఎమ్మెల్యే..!