నిజమే బాసు ఎవరు అవునన్నా కాదన్నా… వరుణ్ తేజను సాన పెట్టి మాస్ హీరో లుక్ తీసుకువచ్చింది మాత్రం డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాత్రమే. అప్పటి వరకు “ముకుంద్, కంచే” వంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ లో కనిపించిన వరుణ్ తేజను “లోఫర్” సినిమాతో వరుణ్ తేజ్ లుక్ మొత్తం మార్చేసి మాస్ హీరోగా వరుణ్ కరెక్ట్ గా సరిపోతాడని పూరి జగన్నాధ్ బలంగా నమ్మాడు. కానీ ఆ సినిమాలో వరుణ్ తేజ్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చినా డైరెక్షన్ ఫెయిల్ అవ్వడంతో సినిమా చేతులెత్తేసింది.

ఆ సినిమాను దృష్టిలో పెట్టుకునే తమిళంలో ఊర మాస్ సినిమా “జిగర్తాండ” వెతుకుంటూ వరుణ్ తేజ్ దగ్గరకు వచ్చిందనుకుంటా. వరుణ్ తేజ్ హీరోగా “జిగర్తాండ”ను రీమేక్ చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ సిద్ధపడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా లుక్ పరంగా ఆందరి మన్ననలు పొందినా నిన్న రిలీజైన టీజర్ తో పీక్స్ కు వెళ్లిందని చెప్పాలి. వరుణ్ తేజ్ లుక్ తో పాటు, అతని యాటిట్యూడ్ మొత్తం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చూపించి “వాల్మీకి” సినిమాపై దర్శకుడు హరీష్ శంకర్ అంచనాలను నాలుగింతలు పెంచేసాడు. కానీ హరీష్ మదిలోకి వరుణ్ తేజ్ రావడానికి ముందు “లోఫర్” సినిమాను గుర్తు చేసుకుని ఉండవచ్చు. అందులో వరుణ్ తేజ్ చెప్పిన డైలోగ్ డెలివరీ, మాస్ లుక్ తో పూరి జగన్నాధ్ చేయించిన ఫైట్స్ అన్ని ఈ సినిమాకు ఎంతో కొంత హెల్ప్ అవ్వడంతోనే వరుణ్ తేజను పరిపూర్ణమైన మాస్ లుక్ లో చూపించడానికి హరీష్ శంకర్ కు అవకాశం దొరికింది. ఈ సినిమా కనుక హిట్ అయితే, వరుణ్ తేజను వెతుకుంటూ మాస్ క్యారెక్టర్స్ వెల్లువలా వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందు రానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •