కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా “జిగర్తాండ”ను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేస్తున్న “వాల్మీకి” సినిమా షూటింగ్ ఫైనల్ దశకు వచ్చింది. వచ్చే సెప్టెంబర్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ రఫ్ లుక్ తో ప్రతినాయక పాత్రలో కనపడనునట్లు తెలుస్తుంది. ఈ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ బ్యానేర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో దర్శక, నిర్మాతలకు చిన్న చిన్న గొడవలు వచ్చాయని బయటకు పొక్కినా అలాంటి వాటికేమి తావివ్వకుండా సినిమాను చకచకా పూర్తిచేస్తూ టీజర్ రిలీజ్ చేసి ఫస్ట్ కాపీ కట్ చేసే దిశగా చిత్ర యూనిట్ పనులనింటిని చక్కబెట్టేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •