సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మరణించాడు. ఊటీలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. ఇక గురువారం రాత్రి తన కుమారుడితో సరదాగా గడిపిన అభినయ్.. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని తెలుస్తుంది.

ఇక అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో విషయం బయటకు వచ్చింది. ఇక అభినవ్ భార్య కూడా డాక్టరే. కాగా అభినయ్ అంత్యక్రియలు శనివారం జరుగుతాయని తెలియచేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వాణిశ్రీ కి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వాణిశ్రీ కుమారుడు మృతి చెందడంతో ఆమె కుటుంభంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఏపీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బుల్లితెర యాంకర్..!

ఏపీలో తొలిసారి ఇంటిదగ్గరే హోం ఐసోలేషన్