కార్తీక దీపం సీరియల్ “వంటలక్క” గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. గత రెండేళ్లుగా బిగ్ బాస్ కు చుక్కలు చూపిస్తుంది. గత ఏడాది వంటలక్క సీరియల్ రేటింగ్స్ బిగ్ బాస్ దాట లేకపోయినా సంగతి తెలిసిందే. ఈ ఏడాదైనా ఎలాగైనా వంటలక్కను బీట్ చేయాలనుకున్న బిగ్ బాస్ కు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈరోజు నుంచి ఐపీఎల్ సీజన్ మొదలు కానుంది. గతంలో ఐపీఎల్ సీజన్ 8 గంటలకు ప్రసారం అయితే ఈ ఏడాది దానిని 7.30కు మార్చారు.

దీనితో గతంలో శివచరణ్ అనే ఒక “కార్తీక దీపం” సీరియల్ అభిమాని బీసీసీఐ చైర్మన్ గంగూలీకి ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ ట్విట్టర్ లో పెట్టాడు. గంగూలీ గారు మా ఇంట్లో అందరం “కార్తీక దీపం” సీరియల్ అభిమానులమని, దానితో పాటు తాము ఐపీఎల్ అంటే పడి చేస్తామని కానీ ఇప్పుడు 7.30 ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో తాము రెండు ఒకేసారి చూడటానికి వీలు కాదని, తమ ఇంట్లో ఒకే టీవీ ఉందని తెలియచేసాడు. అతడు అప్పట్లో చేసిన ట్వీట్ పెద్ద ట్రేండింగ్ గా కూడా మారిపోయింది. దీనిని అప్పట్లో స్టార్ మా యాజమాన్యం రీ ట్వీట్ చేస్తూ అతడి చేసిన అభ్యర్ధన సరైందే అని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అది ఎంతలా ట్రేండింగ్ అయిందంటే ఇప్పటికి సోషల్ మీడియాలో ఆ ట్వీట్ కనిపిస్తూనే ఉంటుంది. “కార్తీక దీపం” సీరియల్ పై చేసిన ట్వీట్ సీరియల్ హీరోయిన్ వంటలక్క (దీప)కు చేరడంతో ఆమె మురిపోయిందట. ఒక సీరియల్ ను ఇంతలా ప్రేమించేవారుంటారా అని తెలుసుకొని వారికి 32 అంగుళాల టివి ఒకటి కొని దానితో పాటు ఒక లెటర్ కూడా పంపించింది. తమ సీరియల్ పై మీరు ఇంత ఆదరణ చూపిస్తునందుకు ధన్యవాదాలని, మీరు ఐపీఎల్ తో పాటు కార్తీక దీపం సీరియల్ రెండు టీవీలలో చూడమని చెప్పడంతో ఇప్పుడు అతగాడి ఇంట్లో రెండు టివిలు చేరిపోయాయి. ఇప్పుడు వంటలక్క అతడికి ట్వీట్ కు ఫిదా అయిపోయి టీవీ పంపించడంతో మరొకసారి ట్రేండింగ్ గ వంటలక్క మారిపోయింది. మరి వంటలక్క సీరియల్ నా మజాకా