సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. మొదట ఈ సినిమాకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు వర్మ. అయితే ఈ సినిమాపై అనేక వివాదాలు చోటు చేసుకోవడంతో ఆ సినిమా టైటిల్ మార్చారు. గత వారంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

మొదటిగా సెన్సార్ బోర్డు సినిమాను చూసి సర్టిఫికెట్ ఇవ్వలేమని చెప్పడంతో రివైజింగ్ కమిటీని ఆశ్రయించాడు వర్మ. కొన్ని సీన్లు కట్ చేసి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రివైజింగ్ కమిటీ. ఇక ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

amma rajyamlo kadapa biddalu