ఈ రోజు ఉదయం ఏపీ సమావేశాలు మొదలు కావడంతోనే విపక్ష, ప్రతిపక్ష సభ్యుల మధ్య హాట్ హాట్ డిస్కషన్స్ తో అసెంబ్లీ ప్రాంగణమంతా వేడెక్కింది. ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే వైఎస్ జగన్ పదే పదే నవ్వడం ఈరోజు అసెంబ్లీ చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు. వర్మ కూడా సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడో… ఏపీ అసెంబ్లీలో ఏవిధంగా ముష్టి యుద్ధాలు చేసుకుంటారో అని ఆతృతగా అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతూ వర్మ సరదాగా ట్విట్టర్ లో స్పందిస్తున్నారు.

rgv

సినిమాలలో బ్రహ్మానందాన్ని చూసినప్పుడు ప్రేక్షకులు ఎలా నవ్వుకుంటారో… జగన్ కూడా చంద్రబాబుని చూడగానే గల్లుమని నవ్వడంతో చంద్రబాబు అండ్ టీడీపీ గ్యాంగ్ అసెంబ్లీలో కామెడీ రోల్ ఏమైనా ప్లే చేస్తుందా అని వర్మ అనుమానంతో కూడిన సెటైర్ వేశారు. వర్మ వేసిన సెటైర్ పట్ల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ నిర్మించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదలవ్వకుండా బాబు అడ్డుకున్నాడో అప్పటి నుంచి చంద్రబాబుని… వర్మ టార్గెట్ చేస్తూ ట్విట్స్ వదులుతూనే ఉన్నారు.