“అర్జున్ రెడ్డి” సినిమాతో సౌత్ ఇండియా మొత్తం తనవైపు చూసేలా చేసి, ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన విజయ్ దేవరకొండ తరువాత అతడు వేసిన తప్పటడుగులతో నిర్మాతలకు బారి నష్టాలను మిగిల్చాయి. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ మొదటిరోజు ఎంత భారీగా ఉంటాయో, సినిమా టాక్ తరువాత అంత దారుణంగా కలెక్షన్స్ పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఫైటర్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులను అలరించనుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో సినిమాకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాను దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ విన్న వెంటనే విజయ్ దేవరకొండ ఒకే చెప్పేశాడట. విజయ్ మొదటి నుంచి తనకు సినిమా కథలో బలం ఉందొ లేదో తెలుసుకోకుండా పెద్ద బ్యానర్ అయితే చాలు ఒకే చెప్పేయడం అతడు వేసిన ఎన్నో తప్పటడుగులు బయటపెడుతున్నాయి.

అసలే లాక్ డౌన్ సమయంలో కరోనా మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో తెలియని సమయంలో నిర్మాతలంతా అప్పుల ఊబిలో కూరుకుపోయి, హీరోలు సైతం వారి రెమ్యునరేషన్ తగ్గించుకొని, భారీగా సినిమా బడ్జెట్ లు తగ్గించుకుంటున్న వేళ విజయ్ దేవరకొండ 100 కోట్ల రూపాయల సినిమాకు ఒకే చెప్పడం చూస్తుంటే అతడి కెరీర్ మరోసారి రిస్క్ లోకి నెట్టాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండను నమ్ముకొని సినిమా కొన్న బయ్యర్లు ఇన్నేళ్ల నుంచి నష్టపోతూనే ఉన్నారు. ఈ సినిమా కూడా అతడి హడావిడి చూసి కొంటే ఒకవేళ సినిమా చేతులెత్తేస్తే తరువాత నుంచి విజయ్ సినిమాలను కొనడానికి బయ్యర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాస్త కరోనా తగ్గిన తరువాత మంచి కథతో బడ్జెట్ తగ్గించుకొని బయ్యర్లకు అందుబాటులో ఉండేలా సినిమా చేస్తే ప్రాజెక్ట్ కొంచెం ప్రామిసింగ్ గా ఉంటుంది.

గుడ్ న్యూస్.. కరోనా వైరస్ ను నిర్వీర్యం చేస్తున్న ఆయింట్‌మెంట్..!

కరోనా వైరస్ అంతమవడంపై WHO చీఫ్ టెడ్రోస్ సంచలన వ్యాఖ్యలు..!

స్వదేశీ నినాదంపై పవన్ కళ్యాణ్ ను ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్లు