ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. తాజాగా ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా ఫలితం సానుకూలంగా వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణం లేకుండానే పాజిటివ్ వచ్చినట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక వెంకయ్య భార్య ఉషా నాయుడుకి కూడా కరోనా పరీక్ష జరపగా ఆమెకు నెగిటివ్ వచ్చింది.