వెంకటేష్ మొదటి నుంచి మంచి చిత్రాలను చేస్తున్నా ఎందుకో రీమేక్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాడు. పర బాషలలో హిట్ అయిన సినిమాలను తీసుకువచ్చి ఇక్కడ రీమేక్ చేయడం వాటిని హిట్ గా మలచడంలో సిద్ధహస్తుడు. ఇక వెంకటేష్ ముఖ్యంగా తమిళ సినిమాలను రీమేక్ చేస్తుంటాడు. ఆ సినిమాలు కాస్త మన నెగటివిటీకి దగ్గరగా ఉండటంతో కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి.

ధనుష్ హీరోగా ఈమధ్య తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న “అసురన్” సినిమాను రీమేక్ చేయడానికి ఇప్పటికే రీమేక్ రైట్స్ తీసేసుకున్నారు. కానీ ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నదే కాస్త సందిగ్ధత నెలకొని ఉంది. తెలుగులో కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేయమని ఒరిజినల్ సినిమా “ఆసురన్” దర్శకుడు వెట్రిమారన్ ను అడగగా అతడు ఇప్పటి వరకు తమిళ సినిమాలకు దర్శకత్వం వహించడంతో తెలుగు ఇండస్ట్రీకి రావడానికి అంత ఇష్ట పడలేదట.

కానీ ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించినా కత్తి మీద సామే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఒక దళిత సినిమా… ఈ సినిమా సమాజంలో వర్గ సమానత్వం గురించి చెప్పబడింది. అలాంటి సినిమాను తెలుగులో చెడకొడతారేమో అని భయంగా ఉందని ఇప్పటికే కత్తి మహేష్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. కానీ ఈ సినిమా వెంకటేష్ లాంటి హీరోకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ప్రస్తుతాని డైరెక్టర్ ను వెతికే పనిలో బిజీగా ఉన్న వెంకటేష్ టీమ్ త్వరలో దర్శకుడుని ఎంపిక చేసి సెట్స్ మీదకు తీసుకొని వెళ్లనున్నారు.