రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ పై తన తండ్రి హీరోగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లిన తరువాత అతడు పునరాగమనం చేసిన తరువాత రెండు సినిమాలలో నటించాడు. ఆ రెండు సినిమాలు రామ్ చరణ్ నిర్మించాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతునన్ సినిమా కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ బయట హీరోలతో కూడా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా మలయాళంలో మంచి హిట్ గా నిలిచినా “డ్రైవింగ్ లైసెన్స్” సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్థలున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్త ఏమిటంటే ఈ సినిమాను వెంకటేష్ హీరోగా నిర్మించాలని బావిస్తున్నాడట. వెంకటేష్ అయితే ఈ సినిమాకు సరిగ్గా సరిపోతాడని వెంకటేష్ కనుక ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకుంటే రామ్ చరణ్ మొదటిసారి బయట హీరోతో తన ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్ తమిళ రీమేక్ మూవీ ‘అసురన్”లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాలా నిర్మిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినిమా రూపుదిద్దుకుంటుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •