విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ‘ప్రేమమ్’ సినిమాలో కొద్ది సేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తుండంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకుంది.

ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది తెలుస్తోంది. ఇందులో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్, వెంకటేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి జతకట్టనున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. అలాగే నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •