విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య హీరోలుగా వస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకీ మామ’. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు, ఫస్ట్ లుక్ కు, పాటలకు మంచి స్పందన వచ్చింది.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఈ రోజు ఖమ్మంలో మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక సురేష్ ప్రొడక్షన్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలవుతుంది.