విక్టరీ వెంకటేష్ ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకీ మామ’. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా మేనల్లుడి గండం అనే కాన్సెఫ్ట్ తో తీస్తున్నారట. ఈ సినిమాలో వెంకటేష్ మరణం అంచుల వరకు వెళ్లి వస్తారని అంటున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటించారు.

తొలిసారి వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించడంతో అభిమానులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సురేష్ ప్రొడక్షన్, బ్లు ప్లానెట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ‘జై లవకుశ’ ఫేం బాబీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మొదట దసరాకు విడుదల చెయ్యాలని చూసారు. కానీ నిర్మాత సురేష్ బాబు డిసెంబర్ కి వాయిదా వేశారు.