అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా వంటి హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాగా ‘మిస్టర్ మజ్ను’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో విజయ్ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత అఖిల్ తోనే మరో సినిమా చేయనున్న వెంకీ.. ఈ మూవీ తరువాత విజయ్‌తో ఓ సినిమాను చేసే అవకాశమున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పూర్తయిన తర్వాత వెంకీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •