బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న సినిమా ‘వెంకీ మామ’. ఇందులో రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లైన వెంకటేష్-చైతన్య ఈ రీల్‌ లైఫ్‌లోనూ అలానే కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌ 12న స్టార్ట్‌ కానుంది. వెంకీమామ’ తొలి షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్‌ చేసారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా.. వెంకటేష్ సరసన నటించే హీరోయిన్‌ కోసం కొందరి అగ్రకథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.
  •  
  •  
  •  
  •  
  •  
  •