విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ల మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. ఈ నెల 24 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఈ ఇందులో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించనుంది. మొదట చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు. కానీ చైతూకు జోడి గా సరిపోవట లేదని ఇప్పుడు రాశి ఖన్నాని తీసుకున్నారు.

రాశీ గతంలో ‘మనం’ చిత్రంలో కొద్దిసేపు నాగ చైతన్య సరసన మెరిసింది. కాగా ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
  •  
  •  
  •  
  •  
  •  
  •