దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత ‘ఇష్మార్ట్ శంకర్’ సినిమాతో పూరి మంచి హిట్ కొట్టాడు. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు సంబంధిన స్టోరీ ఇప్పటి వరకు హాలీవుడ్ కు చెందిన “క్రిమినల్” సినిమా నుంచి తీసుకొని తీశారని వార్తలు వచ్చాయి. మెమరీ ట్రాన్స్ఫర్ కు సంబంధించి అంశాలున్నా మిగతా కథ అంతా పూరి తనకు తగట్లు మార్చుకొని తెలంగాణ యాశా, భాషలతో మంచి మాస సినిమా తీసాడు.

ఇక సినిమా విడుదలై మంచి విజయం సాధించి, సినిమా పెట్టుబడి కూడా వెనక్కు వచ్చిన తరువాత హీరో ఆకాష్ వచ్చి ఇది తన కథ అంటూ, తన కథను పూరి కాపీ కొట్టాడని వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. తమిళంలో “నాన్ యారు” అనే పేరుతో రిలీజైన ఈ సినిమా సోదిలో లేకుండా అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఇక తెలుగులో కూడా “కొత్తగా ఉన్నాడు” అనే పేరుతో విడుదల చేయాలని బావించాడట. కానీ నా స్టోరీని పూరి కాపీ కొట్టడంతో ఏమి చేయాలో పాలు పాలవడం లేదనట్లు మాట్లాడుతున్నాడు.

అసలు ఆకాష్ ను తెలుగు ఇండస్ట్రీ మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన “ఆనందం” వంటి మంచి హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి తరువాత ఎక్కువగా ప్లాపుల రుచే చూసాడు. ఇక ఇప్పుడు పూరి సినిమా హిట్ కావడంతో ఇలా మీడియా ముందుకు వచ్చి హల్ చల్ చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న పాయింట్ పట్టుకొని రకరకాల సినిమాలు వచ్చినవి కొన్ని వందలు ఉన్నాయి. ఆ సినిమా పాయింట్ నాదే అని చెప్పి కూర్చుంటే అది ఎంత వరకు సబబనేదే తెలియాలి. ఇన్ని రోజులు పూరి హాలీవుడ్ నుంచి సినిమాను పట్టుకొచ్చాడనుకుంటున్న ప్రేక్షకులకు… ఇది నా స్టోరీనే అని చెప్పడంతో.. ఆకాష్ హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టాడా… హాలీవుడ్ వారే ఆకాష్ స్టోరీని కాపీ కొట్టారా అన్న ప్రశ్న తేలాల్సి ఉంది. 

 
  •  
  •  
  •  
  •  
  •  
  •