ఏడేళ్ల క్రితం ఢిల్లీ వీధులలో ఒక కదులుతున్న బస్సులో నలుగురు నిందితులను అత్యంత పాశవికంగా నిర్భయ అనే మహిళను అత్యాచారం చేసి బస్సు నుంచి కిందకు తోసేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడమే కాకుండా నిర్భయ పేరుతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది.

ఈ కేసుకు సంబంధించి ఏడేళ్ల తరువాత అత్యాచారం చేసిన నిందితులకు అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష అమలు చేయడంతో ఈనెల జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఒకేసారి నలుగురు దోషులను ఉరితీయనున్నారన్న సంగతి తెలిసి దేశం మొత్తం ఆనందించింది. కానీ ఇప్పుడు తాము జనవరి 22న ఉరి తీయలేమని తేదిని మార్చాలని తీహార్ జైలు అధికారులు కోరడంతో నిర్భయ తల్లి ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఇప్పటికే నిర్భయ కేసులో నిందితులు తమకు క్షమాబిక్ష పెట్టాలని, జీవిత ఖైదుగా మార్చాలని కోరడం, దానిని కోర్ట్ తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు ఉరిశిక్ష తేదీ మార్చాలని తీహార్ జైలు అధికారులు కోరిన దానిని చూస్తుంటే ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ ప్రభుత్వంతో పాటు తీహార్ జైలు అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని నాడు నిర్భయ ఘటన తరువాత ఎవరైతే రోడ్ల మీదకు వచ్చి పోరాడారో వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తమ నుంచి ఎలాంటి ఆలస్యం లేదని వివరణ ఇచ్చుకున్న నిర్భయ తల్లి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కొద్ది సేపటి క్రితమే నిర్భయ నిందితుల క్షమాబిక్ష పిటీషన్ రాష్ట్రపతి కొట్టివేయడం జరిగింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •